రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభించిన జనసేనాని

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుతో కలిసి రైతు సౌభాగ్య దీక్షలో కూర్చున్నారు.కాకినాడ జేఎన్టీయూ కాలేజి ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికలో ఆయన దీక్షకు దిగారు. రైతు సమస్యలపై ఆయన గొంతెత్తనున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజోలు నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ ఈ దీక్షకు హాజరు కాలేదు..అసెంబ్లీ సమావేశాలలో ఉన్నందున తాను దీక్షకు రాలేనని ఆయన నిన్ననే ప్రకటించారు.