ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉంది: ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

వాస్తవం ప్రతినిధి: పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. పీఎస్‌ఎల్వీ సీ-48 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడారు. పీఎస్‌ఎల్వీ సీ-48 తమకు 50వ ప్రయోగమన్నారు. ఆర్‌.వి.పెరుమాళ్‌ సారథ్యంలో పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగించామన్నారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందానికి ఛైర్మన్‌ అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ48 షార్‌ నుంచి చేపట్టిన 75వ ప్రయోగం అని పేర్కొన్నారు. 576 కిలోమీటర్ల కక్ష్యలోకి రీశాట్‌ 2బీఆర్‌1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రయోగం సక్సెస్‌తో ఛైర్మన్‌ శివన్‌ పీఎస్‌ఎల్‌వీ 50 పేరుతో పుస్తకం విడుదల చేశారు.