ఈ నెల 14 న పశ్చిమ గోదావరి జిల్లా లో పర్యటించనున్న జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 14 న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గాంధేయవాది, స్వతంత్ర సమరయోధుడు మూర్తిరాజు 100 వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం గణపవరం డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌ లో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గని సిఎం ప్రసంగించనున్నారు. స్వాతంత్ర సమారయోధులను సిఎం వైఎస్‌ జగన్‌ సత్కరించనున్నారు.