జగన్ సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

వాస్తవం ప్రతినిధి: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఇతర హింసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం చక్కని నిర్ణయం తీసుకుందని చిరంజీవి ప్రసంసించారు.

మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు చట్టంలో మార్పులు తేవడాన్ని సమాజంలో అన్ని వర్గాలు అభినందిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ శివారుల్లో జరిగిన దిశ సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఉదంతం అందరినీ కలచి వేసింది. నేరస్థులను శిక్షించిన సైబరాబాద్ పోలీసులను పలువురు అభినందించారు.

ఈ నేపథ్యంలోనే జగన్ కేబినెట్ క్రిమినల్ చట్టంలో మార్పులు తేవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అందరితో పాటు మెగాస్టార్ కూడా స్పందించారు.  ముఖ్యమంత్రిని అభినందించారు. అతివలకు అండగా నిలిచేలా ‘ఏపీ దిశ చట్టం’ తీసుకు రానుండడాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. వైఎస్ జగన్ సర్కారు సరైన చర్యలు తీసుకుందని, ఇటువంటి చట్టాన్ని తొలుత తెలుగు రాష్ట్రమైన ఏపీ తీసుకురావడం గర్వకారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడితే, ఆపై ఎవరూ అమ్మాయిల జోలికి వెళ్లబోరని, ఆ భయం నేరస్తుల్లో పెరగాలని అభిప్రాయపడ్డారు