ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు!

వాస్తవం ప్రతినిధి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు రద్దుకు ఆమోదం తెలిపింది. దిశ చట్టానికి ఆమోదం, ప్రజారవాణ శాఖ ఏర్పాటుకు ఆమోదం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం, కాపు ఉద్యమంలో తుని రైలు దహనం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ నిర్ణయం, కాపు ఉద్యమం నాటి కేసులు మాఫీ, భోగాపురం ఎయిర్ పోర్టు వ్యతిరేక ఉద్యమ కేసులు మాఫీ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణకు కొత్తశాఖ, సాధారణ పరిపాలన శాఖ పరిధిలోకి కొత్త శాఖ, సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ భూములకు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం మంత్రివర్గం తీసుకుంది.