విజేతను నిర్ణయించే టీ20 సిరిస్‌ ..మరికొన్ని గంటల్లో ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: టీ-20 సిరిస్‌లో వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అయింది టీమిండియా. ఉప్పల్‌లో గెలిచి, తిరువనంతపురంలో ఓడిన కోహ్లీసేన.. ముంబైలో సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ ఆడనుంది. మ్యాచ్ విజేతే సిరీస్‌ను సొంత చేసుకోనుండటంతో… రెండు జట్లును ముంబై మ్యాచ్‌పై కన్నేశాయి. దీంతో క్రికెట్‌ అభిమానులు మరో ఆసక్తికర మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి టీమిండియా కప్ అందుకుంటుందా..? విండీస్‌కే అప్పగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మూడు టీ20ల సిరిస్‌లో ఆఖరిదైన ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఆఖరి టీ20లో విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే టీ20ల్లో సొంతగడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.మొత్తంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు.