భారత సైనికాధికారులపై ధోనీ టీవీ సిరీస్

వాస్తవం ప్రతినిధి: ప్రపంచకప్‌ ముగిశాక క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ భారత సైనికాధికారులపై ఓ టీవీ సిరీస్ను తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట. టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న మహీ ఆమధ్య రెండు వారాలు సైన్యంలో పనిచేశాడు. ‘అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు సాధించిన ఆర్మీ అధికారులపై కథనాలను ఈ షో వివరిస్తుంది. వాళ్ల స్ఫూర్తిదాయక జీవితాలను దేశ ప్రజలకు తెలియజెప్పాలనేది ధోనీ ఆలోచన. వచ్చే ఏడాది ఈ సిరీస్‌ ప్రసారమవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్పనులు జరుగుతున్నాయి’ అని ధోనీ సన్నిహితులు తెలిపారు. స్టూడియో నెక్స్ట్‌, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మించే ఈ సిరీస్‌ సోనీ టీవీలో ప్రసారం కానుంది.