ఆట మధ్యలో బిడ్డకు పాలిచ్చిన వాలీబాల్ ప్లేయర్..ఫొటో వైరల్‌

వాస్తవం ప్రతినిధి: మిజోరం స్టేట్‌ గేమ్స్‌ 2019 మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా లాల్వెంట్ లాంగీ అనే మహిళ టుయికుమ్‌ వాలీబాల్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. అయితే, ఆమెకు ఏడు నెలల పసిపాప ఉంది. ఈ గేమ్‌లో విజయం సాధించాలన్న తపనతో పాటు తన పాప ఆకలిని తీర్చాలనే ఆలోచన ఆమెలో ఉంది. పాల కోసం ఏడుస్తున్న పాపకు గేమ్ మధ్యలో పాలిచ్చి తన తల్లిప్రేమను చాటుకుంది. పాపకు పాలిస్తున్న ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసి మిజోరం క్రీడల శాఖ మంత్రి రాబర్ట్‌ రోమవియా ఆమెను మెచ్చుకోవడంతో పాటు పదివేలు నగదును అవార్డుగా ప్రకటించారు.