జగన్ పై పొగడ్తలు వర్షం కురిపించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు…!

వాస్తవం ప్రతినిధి: మహిళా భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల దిశ ఘటన సందర్భాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. అటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరగటం నిజంగా సిగ్గుచేటు విషయమని new ruleపేర్కొన్నారు. దేశంలో రోజురోజుకీ ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు పెరుగుతున్న సందర్భంలో చట్టాలు ఉన్నాగాని ప్రస్తుతం ఏం చేయలేని స్థితిలో ఉన్నామని … కానీ దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు మరియు కేసీఆర్ ప్రభుత్వం చూపిన చొరవ విధించిన శిక్ష పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హ్యాట్సాఫ్ చెప్పారు జగన్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళ భద్రతకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావటం జరుగుతుందని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ ప్రముఖ నటి విజయశాంతి జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మహిళల భద్రతకు సంబందించి జగన్ కొత్త చట్టం తీసుకురావడాన్ని ఆమె మెచ్చుకున్నారు. ‘వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నాను .. ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.