ఓట్ల కోసం కాదు ఇప్పుడు చేయండి పాదయాత్రలు పవన్ సంచలన కామెంట్స్..!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాయలసీమ పర్యటనలో చేస్తున్న ప్రసంగాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా వైసిపి పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన క్రమంలో ఆ ప్రాంతంలో రైతుల బాధలు మరియు వారి కష్టాలు తెలుసుకొని ఆవేదన చెంది తీవ్ర భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు..వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఓట్ల కోసం కాదు, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్ర చేయాలంటూ పరోక్షంగా సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు.. ఇక, రైతులు కన్నీళ్లతో పంటలు పండిస్తున్నారు.. నాపై విమర్శలు చేయడం కాదు.. రైతుల కష్టాలు తీర్చండని డిమాండ్ చేసిన ఆయన.. పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే రాత్రికిరాత్రే రూ.87 కోట్లు విడుదల చేయడం కాదు.. నిరంతరం రైతుల సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూడా పడిపోతాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.