సొంత పార్టీ నేత రాజీనామా, షాక్ లో ఉన్న జగన్..?

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడం లో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న జగన్ కి సొంత పార్టీ నేత తాజాగా ఇచ్చిన షాక్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళితే పార్టీలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఇటీవల కొంతమంది ప్రజాప్రతినిధులు వైసిపి అధిష్టానంపై వ్యతిరేకత చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బహిరంగంగా మీడియా ముందే నెగిటివ్ కామెంట్లు ఇటీవల చేస్తున్న సందర్భాలు బయట పడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ పార్టీ కి చెందిన ఒక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ముద్దన తిరుపతి నాయుడు నేడు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే ముద్దనకు కాదని డీసీఎంఎస్ చైర్మన్ పదవిని వేరేవారికి ఇచ్చిన కారణంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీంతో పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు మరియు అదే విధంగా జగన్ కూడా షాక్ తిన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.