మానవత్వం చాటుకున్న ఎన్నారై…!

వాస్తవం ప్రతినిధి: కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతోపెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. అటువంటి అమ్మ కోసం ఓ బిడ్డ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగానే చికిత్స అందిస్తూ…మానవత్వం చాటుకున్నాడు. వివరాల్లోకేలితే…భారతదేశంలోని పంజాబ్‌లో మోగా అనే చిన్న గ్రామం లో పుట్టిన కుల్వంత్ సింగ్ ధలివాల్.. కష్టపడి చదివి, డబ్బు సంపాదించాలనే కలలతో బ్రిటన్‌కు వెళ్లారు. అయితే కుల్వంత్ తల్లి కోన్ని రోజులుగా కేన్సర్ మహమ్మారితో భాదపడుతుంది. కుల్వంత్ సింగ్ బ్రిటన్‌లో ఉండగా.. కేన్సర్‌తో బాధపడుతున్న కుల్వంత్ తల్లి కన్నుమూసింది. అ సమయంలో కుల్వంత్ ఆయన తల్లీలా మరే తల్లీ కేన్సర్ మహమ్మారికి బలి కాకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం రూ.25కోట్లు ఖర్చుపెట్టి పంజాబ్‌లో కేన్సర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఒక్కపైసా కూడా తీసుకోకుండా ఉచితంగానే కేన్సర్ చికిత్స అందిస్తామని కుల్వంత్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కొన్ని లక్షలు ఖర్చుపెట్టి పంజాబ్ వ్యాప్తంగా 9వేల గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించామని కుల్వంత్ సింగ్ చెప్పారు.