డోపింగ్‌లో పట్టుబడ్డ సత్నామ్‌ సింగ్‌ భమారా

 వాస్తవం ప్రతినిధి: భారత ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్ సత్నామ్‌ సింగ్‌ భమారా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. దీంతో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సత్నామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. భారత్‌ నుంచి నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా సత్నామ్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) 23 ఏళ్ల పంజాబ్‌ ప్లేయర్‌ సత్నామ్‌ శాంపిల్స్‌ను సేకరించింది. వీటిలో ‘ఎ’ శాంపిల్‌ను పరీక్షించగా.. సత్నామ్‌ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్‌ 19 నుంచి భమారాపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది.