ఢిల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి

వాస్తవం ప్రతినిధి: ఢిల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామన్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్న అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం చాలా దురదృష్టకరమని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 44 మంది మృతి చెందారు. 1997లో ఢిల్లీలోని ఓ సినిమాహాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. నాటి ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.