‘నిర్భయ’ కేసు లో నిందితుడి సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: ‘దిశ’ హత్యాచార ఘటనతో.. మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా నిర్భయ ఘటనకు సంబంధించి ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా రాష్ట్రపతి రద్దు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ కేసులో.. అనుకోకుండా.. ఓ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. వినయ్‌ శర్మ అనే వ్యక్తి పేరిట.. ఓ క్షమాపణ పత్రం.. గవర్నర్ వద్దకు అలాగే.. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఆ లెటర్‌తో నాకు సంబంధం లేదని.. తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోదని అతను చెబుతుండటం గమనార్హం. అయితే.. మరి ఇది ఎవరు చేశారనే అనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.