ఢిల్లిలో భారీ అగ్నిప్రమాదం..32 మంది సజీవదహనం

వాస్తవం ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 30 ఫైరింజన్లతో పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో 32 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందగా, 50 మందిని అగ్నిమాపక సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.