జగన్ పై ఫుల్ సీరియస్ అయిన అచ్చెనాయుడు..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆర్టీసీ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చే ఆరు నెలల లోపే ఆర్టీసీ మనుగడ కోసం చార్జీలు పెంచే నిర్ణయం ఇటీవల తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించడం తో పల్లెవెలుగు, సిటీ సర్వీసులకు కిలో మీటర్‌కు 10 పైసలు, మిగతా సర్వీసులపై 20 పైసలు పెంచినట్లు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచడంతో జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విపక్ష పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక సమస్య మరియు ఉల్లిపాయలు సమస్యలతో సతమతమవుతున్న సామాన్య ప్రజల జీవితాలలో తాజాగా ఆర్టీసీ చార్జీలు పెంచి మరీ సామాన్యుల బతుకుల తో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుంది అని, ఎన్నికల ప్రచారంలో ఎటువంటి చార్జీలు పన్నులు పెంచమని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ ప్రజలను మోసం చేస్తూ ఇష్టానుసారంగా పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అచ్చెనాయుడు మండిపడుతున్నారు. చేతగాని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే సామాన్యుల బతుకులు ఇలానే ఉంటాయని ఆరు నెలలకే ఇలా ఉంటే ఇంకా ఐదు సంవత్సరాల లోపు ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో అంటూ ఎమ్మెల్యే అచ్చెనాయుడు సీఎం జగన్ పై ఫుల్ సీరియస్ అవ్వడం జరిగింది.