టీ20ల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 1000 పరుగులు సాధించిన భారత 7వ క్రికెటర్‌గా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 62 పరుగులు చేశాడు.

ఫలితంగా టీ20ల్లో భారత్ తరుపున వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తన 29వ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు.