దేశంపై తనలో ఉన్న ప్రేమను చాటిచెప్పిన పవన్..!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా గాని ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా రాజకీయం చేస్తూ రూలింగ్ పార్టీ కి చెమటలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైసీపీని మరియు అదే విధంగా రాయలసీమలో ఉన్న రాజకీయ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతుండగా మరోపక్క దేశంపై తనలో ఉన్న ప్రేమను చాటిచెప్పే విధంగా పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ప్రకటన చేశారు. విషయంలోకి వెళితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “కేంద్రీయ సైనిక బోర్డు కుటుంబాల సంక్షేమార్థం” అక్షరాలా 1 కోటి రూపాయలు విరాళం చేసారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయి ప్రస్తుతం రాజకీయ నాయకుల లో ఎవరికీ పవన్ కళ్యాణ్ లాంటి దేశభక్తి మరొకరికి లేదని తెలియజేస్తూ వస్తున్నారు.