అమెరికాలో అమానుషం..పాపను బలాత్కరించి ఫొటోలు, వీడియోలు తీసిన పైశాచిక పేరంట్స్

వాస్తవం ప్రతినిధి: మానవత్వం మంటగలుస్తోంది. రేప్ & మర్డర్లు.. అంటూ వచ్చే వార్తలే అందరిని కలిచివేస్తున్నాయి. నిందితులకు శిక్షలు కఠినంగా వేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వార్తలను వింటూనే ఉన్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది. ఆగంతకుడు ఎవరో అమ్మాయిని చిదిమేసి చంపితేనే మనం ఇంత మరిగిపోతున్నాము. అలాంటిది ప్రేమగా చూసుకోవాల్సిన కన్న తండ్రినే అత్యాచారం చేస్తె అంతకన్న ఘోరం మరోకటి ఉండదు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. వంకర ఆలోచనలతో సభ్యసమాజం ఛీ కొట్టేలా ప్రవర్తించాడు. కన్న కూతురిని కాపాడాల్సిన బాధ్యతను మరిచి అతడే ఆమెను కాటేశాడు. వావివరుసలు మరిచి కన్నకూతురినే కాటేసిన ఓ వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. అభం-శుభం తెలియని తమ రెండేళ్ల పాపను అత్యంత దారుణంగా బలాత్కరించి, దాన్ని వీడియోలు, ఫొటోలు తీసిన ఈ హృదయ విషాదకరణ ఘటన అమెరికాలో లో చోటుచేసుకుంది. గెరాడ్ కోడింగ్టన్(25), క్రిస్టీనా నెల్సన్ కోడింగ్టన్(29) దంపతులు తమ రెండేళ్ల కుమార్తెపై అత్యంత దారుణంగా బలాత్కరించి, దాన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి తన మెసెంజర్ యాప్‌కు రావడంతో షాకైన ఓ వ్యక్తి..ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఈ జంటను అదుపులోకి తీసుకున్ని విచారణ మొదలు పెట్టారు పోలిసులు. పోలిసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలిసుల విచారణలో వీరి కంప్యూటర్‌లో 6వేల పేజీల అశ్లీల కంటెంట్ లభించింది. ఈ మొత్తాన్ని వారు కోర్టు ముందుంచారు. కనీసం పెరోల్ కోసం విన్నవించుకునే అవకాశం కూడా లేకుండా దంపతులు చచ్చేదాకా జైల్లోనే గడపాలని ఓక్లహామా కోర్టు కఠినంగా శిక్షించింది. ఊహతెలియని ఆ పాపను అత్యంత దారుణంగా బలాత్కరించిన వీడియోలు, ఫొటోలు తన మెసెంజర్ యాప్‌కు ఎలా వచ్చాయి అని ఆరా తీశాడు అ వ్యక్తి. ఐపీ అడ్రస్ ద్వారా గెరాడ్ పేరిట ఉన్న కంప్యూటర్ నుంచి తనకు ఇలాంటి వీడియోలు వచ్చాయని తెలుసుకున్నాడు.