ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినందుకు గవర్నర్‌ అరెస్ట్‌

వాస్తవం ప్రతినిధి: 3.5 మిలియన్‌ డాలర్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వోయి నగరంలో కెన్యా గవర్నర్‌ మైక్‌ సోంకో బువీ అరెస్టయ్యారు. చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశాల మేరకు గవర్నర్‌ మైక్‌ సోంకో బువీ ను అదుపులోకి తీసుకున్నట్టు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మైక్‌ సోంకో బువీ పై పలు కేసులు నమోదై ఉన్నప్పటికి 2017లో గూబర్‌నొటోరియల్‌ పోల్‌ కెన్యా అధ్యక్షుడిగా ఆయన ని నామినేట్‌ చేశాయి. గతంలో డ్రగ్స్‌ అక్రమ రవాణాకు పాల్పడి మైక్‌ సోంకో బువీ జైలు శిక్ష కూడా అనుభవించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మైక్‌ సోంకో బువీ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదని, అవినీతి ఆరోపణ కేసులో మైక్‌ సోంకో బువీకు జైలుశిక్ష పడటం ఖాయమని చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అన్నారు.