ఉన్నావ్ ఘటనకు నిరసనగా అసెంబ్లీ గేటు వద్ద ధర్నా కు దిగిన అఖిలేష్

వాస్తవం ప్రతినిధి: ఉన్నావ్ ఘటనపై బాధితురాలి మృతికి యావత్ ఉత్తరప్రదేశ్ అట్టుడుకిపోతోంది. నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. మరోవైపు ఉన్నావ్‌ ఘటనను నిరసిస్తూ సమాజ్‌వాదీ పార్టీ నేత ,మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆందోళనకు దిగారు. అసెంబ్లీ గేటు వద్ద అఖిలేష్ బైఠాయించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా, ఉన్నావ్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితురాలి మృతికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం పేర్కొన్నారు.