ప్రతీకారం తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుంది: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే

వాస్తవం ప్రతినిధి: దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు. పగ తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుందని చెప్పారు. రాజస్థాన్ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలన్నారు. తక్షణ న్యాయం అడగడం సరికాదని చెప్పారు.

 దిశ కేసు విషయం ఎన్ కౌంటర్ ఘటనలపై పిటిషన్‌ సుప్రీంకోర్టుకు చేరింది.   న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్‌లు శనివారం (డిసెంబర్7, 2019) పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.