13వతేదీన విశాఖపట్నంలో పర్యటించనున్న జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 13వతేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో చేపట్టనున్న రూ.1000కోట్ల అభివృద్ధి పనులకు కైలాసగిరిపై సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పరిశీలించారు.