సోషల్ మీడియా దుర్వినియోగం వల్లే దేశంలో అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి : నితీశ్ కుమార్

వాస్తవం ప్రతినిధి: సోషల్ మీడియాను దుర్వినియోగం చెయ్యడం వలనే దేశంలో మహిళలు, చిన్నారుల మీద లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయని, సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు కావాలనే దుర్వినియోగం చేస్తున్నారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. పొర్న్ వెబ్ సైట్ల కారణంగానే దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నితీశ్ కుమార్ కోరారు. పొర్న్ వెబ్ సైట్లు పూర్తిగా నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పొర్న్ వెబ్ సైట్లు నిషేదించాలని కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తున్నానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అంటున్నారు.