నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: ఆనం రామనారాయణ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారిందని వైకాపా నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడుతూ… భూమి, మద్యం,ఇసుక, బెట్టింగ్‌ మాఫియా పెరిగిందని చెప్పారు. మాఫియా ఆగడాలు చెప్పలేక వేల కుటుంబాలు కుమిలిపోతున్నాయన్నారు. గత ఐదేళ్లలో నలుగురు ఎస్పీలు మారిన చరిత్ర నెల్లూరు జిల్లాదని ఆనం ఎద్దేవా చేశారు.