అర్ధాంతరంగా జగన్ ఢిల్లీ పర్యటన నుండి ఏపీకి రావటానికి కారణం ఇదే..!

వాస్తవం ప్రతినిధి: కియా మోటార్స్ పరిశ్రమల ఓపెనింగ్ కార్యక్రమం తర్వాత హడావిడిగా ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అర్ధాంతరంగా ఢిల్లీ నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్ రావడం పట్ల రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే జగన్ ఢిల్లీ పర్యటన వెనుక గల కారణం…ఆయన కుటుంబానికి మూడు తరాలు వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పనిచేసిన దంపెట్ల నారాయణ మృతి చెందటం. వైయస్ కుటుంబానికి అనగా వైయస్ రాజారెడ్డి మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి అదే విధంగా వైయస్ జగన్ కి వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన మృతి చెందటంతో వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటన అర్ధంతరంగా ఆపేసి దంపెట్ల నారాయణ ఇంటికి చేరుకున్నారు.

గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధ పడటం తో శుక్రవారం దంపెట్ల నారాయణ మృతి చెందడం జరిగింది. ఆయన మృతి చెందడంతో ఢిల్లీలో ఉన్న జగన్ ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా దిగువపల్లి గ్రామం కి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకున్నారు.

దీంతో జగన్ తీవ్ర భావోద్వేగానికి గురైన దంపెట్ల నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు మరియు అదే విధంగా మృత దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.