దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సైనా నెహ్వాల్ స్పందన

వాస్తవం ప్రతినిధి: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశను ఎక్కడైతే నిందితులు అత్యంత క్రూరంగా హత్యాచారం చేశారో అదే ప్రాంతంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేయడం విశేషం. పోలీసులు ఎన్‌కౌంటర్‌‌పై అటు ప్రజల నుంచి ఇటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ తన ట్విట్టర్‌లో “గ్రేట్‌ వర్క్‌ హైదరాబాద్‌ పోలీసు. వుయ్‌ సల్యూట్‌ యు” అంటూ కామెంట్ పెట్టారు. కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ కూడా హైదరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.