ఇమ్మిగ్రేషన్ విభాగాల్లో కెనడాకు మొదటిస్థానం

వాస్తవం ప్రతినిధి: వలసదారులకు, పెట్టుబడిదారులకు, పర్యాటకులకు కెనడా అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. 20 దేశాలలో 18 ఏళ్లు పైబడిన 20,035 మందితో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్, పెట్టుబడి, ప్రజలు, పరిపాలన వంటి ఆరు కీలక విభాగాల్లో కెనడా మొదటిస్థానంలో నిలిచింది. పాలన, సంస్కృతి, పర్యాటక రంగాల్లో మంచి స్కోరు సాధించిన టాప్-5 దేశాల్లోనూ కెనడా అగ్రస్థానం సంపాదించింది. ఇమ్మిగ్రేషన్, పెట్టుబడి వంటి విభాగాల్లో కెనడా మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండో సంవత్సరం. ఇమ్మిగ్రేషన్, ఇన్వెస్ట్‌మెంట్ వంటి విభాగాల్లో ర్యాంకులు ఇవ్వడానికి ఉపాధి, జీవనం, జీవన నాణ్యత, విద్యార్హతలు, పెట్టుబడి, సామాజిక సమానత్వం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ ర్యాంకుల ద్వారా విద్య, ఉపాధి, పెట్టుబడి వంటి వాటిల్లో ఒక దేశం విదేశీలయును ఆకర్షించడానికి ఉపయోగపడతాయి.