సిడ్నీ: భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా తెలంగాణ వాసి

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌ గల్ఫ్‌ డివిజన్‌ అండర్‌ సెక్రటరీగా పని చేస్తున్న సంజయ్‌కుమార్‌ను ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా నియమించారు. ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్‌కుమార్‌ 2011లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తృతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ములక సంజయ్‌కుమార్‌. అనంతరం సుడాన్‌లోనూ పని చేశారు వరంగల్‌ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్‌కుమార్‌.