అలా అయితే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు..?: సౌరవ్‌ గంగూలీ

వాస్తవం ప్రతినిధి: ఇటీవల బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతం కావడంతో సాధ్యమైనన్ని డే అండ్‌ నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మొగ్గుచూపుతున్నాడు. ఈ విషయం పై గంగూలీ మాట్లాడుతూ..

‘పింక్‌ బాల్‌ టెస్టు సక్సెస్‌ కావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తదుపరి లక్ష్యం. ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు కావాలని నేను అనను. ఒక టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ జరగాలి. నా యొక్క అనుభవాన్ని ఉపయోగించి మిగతా చోట్ల ఎలా పింక్‌ బాల్‌ నిర్వహించాలనే దాని కోసం యత్నిస్తా. టెస్టు మ్యాచ్‌కు ఐదు వేల మంది మాత్రమే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు. అలా ఆడాలంటే ఏ క్రికెటర్‌ ఇష్టంతో ఆడడు’ అని గంగూలీ పేర్కొన్నాడు.