మొదటి సాంగ్ తో దుమ్ము దులిపే రికార్డు సృష్టించిన మహేష్ బాబు..!

వాస్తవం సినిమా: వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించి మంచి టైం లో మహేష్ బాబు కెరియర్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించడానికి మహేష్ రెడీ అయ్యారు. దీంతో సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేయటం జరిగింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల నవంబర్ 22 వ తారీకున సాయంత్రం విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది. టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో దానికి ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం రోజున ఒక సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు.

కొద్దిసేపటి క్రితం మహేష్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. పక్కా మాస్ వే లో సాంగ్ ఉన్నది. మహేష్ బాబు ఇలాంటి సాంగ్ చేయడం ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. పక్కా ర్యాప్ బీట్ తో అదిరిపోయింది. రాక్ స్టార్ దేవిశ్రీ మరోసారి తానేమిటో ఈ సాంగ్ ద్వారా నిరూపించుకున్నారు. ఫస్ట్ సింగిల్ తోనే మహేష్ బాబు ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశారు. మరి ఈ సాంగ్ కు తగ్గా స్టెప్పులు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. జనవరి 11 వ తారీకున ఈ సినిమా రిలీజ్ కానుంది.