చంద్రబాబు కి బానిసల్లా గా వ్యవహరిస్తున్నారు: పవన్, ఓ మీడియా అధినేతపై వైసీపీ నేత విమర్శలు

వాస్తవం ప్రతినిధి: వైసిపి పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరియు అదే విధంగా ఓ మీడియా అధినేత పై విమర్శల వర్షం కురిపించారు. వారిద్దరూ చంద్రబాబు కి పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి తిరుమల పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి మార్గంమధ్యలో మాట్లాడుతూ…

చంద్రబాబు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకపోయినా పవన్‌ కల్యాణ్‌ నోరెత్తకపోవడం ఆయన పాలేరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరు నెలల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన తొత్తులైన పవన్‌ కల్యాణ్, ఓ మీడియా అధినేత ప్రభుత్వంపై బురద చల్లే పనిలో పడ్డారని ఆరోపించారు.

నాయకుడంటే ప్రజల పక్షాన మాట్లాడాలని, మరి చంద్రబాబు పాలేర్లు ఇద్దరూ చంద్రబాబునాయుడుని కాపాడేందుకు కష్టపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలేర్లు పవన్ కళ్యాణ్ ఆ మీడియా అధినేత జగన్ పరిపాలనలో ప్రశ్నించడానికి ఏది కుదరక…కులం మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు పెట్టాలని గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై అలాగే సదరు మీడియా అధినేత పై శ్రీకాంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.