ఉల్లి ధరలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఉల్లి ధరలను పేద ప్రజలకు  అన్ని రైతు బజార్లలో ఇరవై ఐదు రూపాయలకే అందించాలని సూచించారు.

అలాగే ఉల్లిపాయలను బ్లాక్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిని 25 రూపాయల సబ్సిడీ కింద అందజేయవలసిందిగా ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని రాష్ట్ర ప్రజలకు అందించాలని నిర్ణయించారు . అయితే ఒక్కో వినియోగదారులకు ఒక కిలో ఉల్లి మాత్రమే ఇచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.