తమిళనాడులో భారీ వర్షాలు.. 15 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని చెన్నై, కడలూరు కాంచీపురం సహా 8 జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

వర్ష బీభత్సానికి కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలాయి. ఈ ఘటనల్లో ఇళ్లలో నిద్రిస్తున్న 15 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.