ఆలస్యం వద్దు..ఈ నెల 31లోపు ఆ నలుగురిని ఉరితీయండి: విజిత సత్యనాథ్

వాస్తవం ప్రతినిధి: దిశ హత్యాచార నిందిుతులకు ఈ నెల 31లోగా ఉరి వేయాలని అన్నాడీఎంకే సభ్యురాలు విజిత సత్యనాథ్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరారు. ఈ నెల 31లోపు ఆ నలుగురిని ఉరితీయాలన్నారు. అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ న్యాయం జరిగే అవకాశాలు మృగ్యమౌతాయని అన్నారు.

బీజేపీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ.. దిశ ఘటన జరిగిన కొద్దిరోజుల ముందు అదే ప్రాంతంలో మరో ఘటన జరిగిందని.. దిశ ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇలాంటి నేరాలకు విదేశాల్లో ప్రజలే శిక్షలు వేస్తున్నారన్నారు.