వాస్తవం ప్రతినిధి: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఆర్లీన్స్ నగరంలోని పర్యాటక హబ్ అయిన ఫ్రెంచ్ క్వార్టర్లో ఆదివారం కాల్పుల మోత మోగింది. న్యూ ఓర్లీన్స్ కెనాల్ స్ట్రీట్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఫ్రెంచ్ క్వార్టర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:21 గంటలకు తుపాకీ కాల్పుల శబ్దాలకు లా ఎన్ఫోర్స్మెంట్ స్పందించింది, అక్కడ కాల్పులకు గురైన 10 మందిని కనుగొన్నట్లు పోలీసు సూపరింటెండెంట్ షాన్ ఫెర్గూసన్ ఒక మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఘటన హార్డ్ రాక్ హోటల్ సమీపంలో జరిగింది. ఏటా నిర్వహించే థ్యాంక్స్‌గివింగ్ వీకెండ్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం అదనపు గస్తీ బలగాలను మోహరించిన నేపథ్యంలో కాల్పుల ఘటనకు తాము వెంటనే స్పందించామని వివరించారు. ఆ బ్లాక్‌లో ఉన్న తమ పోలీస్ అధికారులపైకి కాల్పులు జరిపారేమోనని తొలుత భావించామని పోలీస్ సూపరింటెండెంట్ షాన్ ఫెర్గూసన్ తెలిపారు. అయితే, అక్కడ చాలా మంది ప్రజలు బయట ఉండడంతో ఎవరు కాల్పులు జరిపారో తాము గుర్తించలేకపోయామని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఐదుగురిని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ న్యూ ఓర్లీన్స్కు, మరో ఇద్దరిని తులాన్ మెడికల్ సెంటర్‌కు పంపగా, 11 వ బాధితుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళాడని ఫెర్గూసన్ తెలిపారు.
ఒక వ్యక్తి ఛాతీకి తుపాకీ గాయంతో, మరొకరి మొండెంకు తుపాకీ గాయంతో బాధపడుతుండగా ఇద్దరు వ్యక్తులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వివిధ వీడియో ఫుటేజ్ మరియు ప్రత్యేక్ష సాక్షులు స్టేట్మెంట్లను స్వాధీనం చేసుకుని ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఏదైనా సమాచారం ఉంటే ముందుకు రావాలని వారు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.