సౌరవ్ గంగూలీ నేతృత్వంలో తొలిసారి బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో జరిగిన తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్‌ లోధా కమిటీ సంస్కరణలలోని పదవీ కాలం పరిమితిని సడలించేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయాలకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే.. గంగూలీ 2024 వరకు బీసీసీఐ బాస్‌గా కొనసాగే అవకాశం ఉంది. బోర్డు ఏజీఎం ముగిశాక విలేకరులతో మాట్లాడిన గంగూలీకి టీ20 ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటుంటుందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దాదా సమాధానమిస్తూ.. ‘దయచేసి ఈ విషయాన్ని ధోనీనే అడగండి’ అని అన్నాడు.