కమెడియన్ బ్రహ్మానందం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఫుల్ ట్రాఫిక్ జామ్..!

వాస్తవం సినిమా: కమెడియన్ బ్రహ్మానందం గతంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉండే వారు. అయితే తాజాగా అనారోగ్య కారణాల వల్ల మరోపక్క అవకాశాలు తగ్గడంతో సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో బుల్లితెరపై కొన్ని కామెడీషో లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు బ్రహ్మానందం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బ్రహ్మానందం కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టడంతో ఆ ప్రాంతంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయంలోకి వెళితే తాజాగా బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం వీరసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. బ్రహ్మానందం రోడ్ షోతో చిక్కబళ్లాపురం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు సుధాకర్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడి వచ్చాను, విజయోత్సవం రోజు మళ్లీ ఇక్కడకు వస్తానని బ్రహ్మానందం స్థానికులకు చెప్పారు. దీంతో బ్రహ్మానందం రావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎత్తున వచ్చారు అంతేకాకుండా బ్రహ్మానందంతో సెల్ఫీ దిగటానికి ఎగబడ్డారు.ఆ ప్రాంతం మొత్తం తెలుగు వారు కావటంతో బ్రహ్మానందం రాకకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.