సైతాన్ మనుషులు సమాజంలో ఉన్నారు జాగ్రత్త అంటున్న సల్మాన్…!

వాస్తవం సినిమా: మనుషుల రూపంలో మృగాలుగా ఉన్న కామాంధులు ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యాచారం చేసిన నలుగురు నిందితులు సాక్షాలు దొరకకుండా ఆమెను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించగా… తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ సందర్భంగా ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను ఉద్దేశిస్తూ.. ‘వారంతా మానవ రూపంలో మారువేషం వేసుకున్న సైతాన్లు.. నిర్భయ, ప్రియాంకారెడ్డిల మరణాలు.. వారిని అంతం చేయడం కోసం మనందరినీ ఒకటి చేశాయి. ‘లెట్ బేటీ బచావో’ను క్యాంపెయిన్‌లా మాత్రమే కాకుండా మనందరం ఒకటిగా నిలిచి.. ఆ రాక్షసులను అంతమొందించాలి. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అటు సల్మాన్ ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.