కోర్టు మెట్లు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్…!

వాస్తవం సినిమా: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొట్టమొదటి సినిమా పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా లోని ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్ అమీషా పటేల్. తెలుగులో ఆమె నటించిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో తన సొట్టబుగ్గల తో తెలుగు ప్రేక్షకులను పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో అలరించి…ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడానికి అమీషా పటేల్ నటన కూడా ఒక భాగమయ్యింది. బద్రి సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న అమీషా పటేల్ మహేష్ బాబు తో నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు చేసి రెండు ఫ్లాపులు వరుసగా చూడటంతో వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసిన అమీషా పటేల్ అక్కడ స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలు దక్కించుకుని మంచి క్రేజ్ ని సంపాదించింది. అయితే ఇటీవల అవకాశాలు దక్కడంతో అమీషా పటేల్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ తరువాత ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఓ చెక్ ఇచ్చింది. కానీ, ఆ చెక్ బౌన్స్ కావడంతో ప్రొడక్షన్ కంపెనీ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు 43 ఏళ్ల అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 27 వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది.