మేము మగాళ్ళం కాదు మృగాళ్ళం అంటున్న సుకుమార్..!

వాస్తవం సినిమా: ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ దారుణమైన ఘటన పై చాలా మంది దేశంలో ఉన్న వివిధ పార్టీల రాజకీయ నేతలు మరియు సెలబ్రిటీలు ఘటనకు పాల్పడిన నిందితులను తీవ్రంగా శిక్షించాలని బహిరంగంగా ఉరి తీయాలి అని ఆ శిక్ష చూసి వేరే మగవాడికి అటువంటి ఆలోచన రాకూడదు అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న సమాజాన్ని బట్టి ఇటువంటి ఘటనలు జరగటం అమానుషమని అలాగే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మరియు ఫోన్ మొబైల్ ఇంటర్నెట్ వల్ల మనుషులు మృగాలుగా మారుతున్నారు అని పేర్కొని ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సుకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాళ్ళం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. మమ్మల్ని నమ్మకపోవడమే బెటర్ అని సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.