జనసేన ఆధ్వర్యంలో తెలుగు వైభవం- తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం

వాస్తవం ప్రతినిధి: తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ల పరిధిలోని నియోజకవర్గాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు వైభవం – తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో ఉర్దు, కన్నడ, ఒడియా, తమిళం, బెంగాలీ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని, వాటిని వదిలేసి తెలుగు మాధ్యమం జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. భాష జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలుగు గురించి పూర్తిగా తెలియకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోయానన్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తెలుగు సినిమాలో సాహిత్యం రోజు రోజుకు దిగజారిపోతుందని పేర్కొన్నారు. కాగితం కిందపడితే కళ్లకు అద్దుకునే సంస్కృతి మనదన్నారు. ఆడ పిల్లల రక్షణలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.