పోలీసు వ్యవస్థ మరింత పటిష్టంగా మారాలి: వెంకయ్య నాయుడు

వాస్తవం ప్రతినిధి: ‘దిశ’ హత్యాచార ఘటనపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో కూడా మార్పులు రావాలన్నారు. పోలీసు వ్యవస్థ మరింత పటిష్టంగా మారాలన్నారు. మహిళలపై దాడులు సామాజిక రోగంగా మారిపోయిందన్నారు. కెవలం హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
‘ఇప్పుడు కొత్త బిల్లు తీసుకురావడం కాదు.. ఇటువంటి దాడులను అరికట్టాలన్న రాజకీయ సంకల్పం మనకు కావాలి. సమర్థవంతమైన పరిపాలన నైపుణ్యాలు ఉండాలి. మనుషుల ఆలోచనా విధానం మారాలి. అప్పుడే సమాజంలో ఇటువంటి చెడును సమూలంగా నాశనం చేయగలం’ అని వ్యాఖ్యానించారు.