ఎయిడ్స్ డే నాడు ట్విటర్ లో జగన్ పై అదిరిపోయే పంచులు వేసిన నారా లోకేష్..!

వాస్తవం ప్రతినిధి: డిసెంబర్ ఒకటవ తేదీ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహిస్తుంటే మరో పక్క మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు నారా లోకేష్ ట్విటర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అదిరిపోయే సెటైర్లు పంచులు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. విషయంలోకి వెళితే వైసీపీ పార్టీ సోషల్ మీడియా కి చెందిన వాళ్లు తనపై లేనిపోని ఫేక్ ఐడి లు క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విషయంలోకి వెళితే ఇటీవల నారా లోకేష్ ఎయిడ్స్ డే నాడు ఒక ట్వీట్ చేసినట్టుగా…అబద్ధపు ఫోటోలు మరియు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రచారం చేయడంతో…నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడిన వైసీపీ పార్టీ సోషల్ మీడియా కి చెందిన వాళ్ళ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ట్విటర్ లో నారా లోకేష్ ఏమన్నారంటే…

“ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్. వై ఎస్ జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు.నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు.” అంటూ నారా లోకేష్ ట్విటర్ లో వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.