మరోసారి సభకు క్షమాపణ చెప్పిన ప్రగ్యాఠాకూర్

వాస్తవం ప్రతినిధి: బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రగ్యాఠాకూర్ లోక్ సభకు రెండో సారి క్షమాపణ చెప్పారు. నాథూరాం గాడ్సే వ్యాఖ్యలకు ఇప్పటికే ఒక సారి క్షమాపణ చెప్పిన ఠాకూర్ తన మాటలను వక్రికరించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె మరోసారి సభకు క్షమాపణ చెప్పారు. దీతో లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేశారు.