సమ్మె చేసిన కార్మికుల చేత చప్పట్లు కొట్టించిన కేసీఆర్..!

వాస్తవం ప్రతినిధి: సరిగ్గా దసరా సెలవులు సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాజకీయ నేతలను ముఖ్యంగా అధికార పార్టీ కేసీఆర్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ఈ క్రమంలో ఎక్కడా కూడా కేసీఆర్ తగ్గకుండా సరైన రీతిలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చేత సమ్మె విరమించేలా వ్యవహరించడంతో తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం తో…న్యాయస్థానాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆర్టీసీ కార్మికులు ఉండటంతో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో భేటీ అయ్యి చర్చలు జరిపి చప్పట్లు కొట్టించుకున్నారు. సమ్మెకాలానికి జీతం త్వరలో ఇస్తామని ఆయన చెప్పినప్పుడు కార్మికులు హర్షద్వానాలు చేశారు. సమ్మె చేయించినవారు అంతా నష్టం తెస్తే తాము సి.ఎమ్. వద్దకు వెళ్లి అన్నీ తెచ్చుకున్నామని చెప్పాలని ఆయన సూచించారు. సమ్మె కారణంగా మరణించినవారి కుటుంబాలలో ఒకరికి ఎనిమిది రోజులలోపు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన మంత్రి అజయ్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు.అంతేకాక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. మీరంతా తన వెంబటి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా అదికంగా జీతాలు సంపాదించుకోవచ్చని, విద్యుత్ సంస్థలలో అలా అధిక జీతాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన మనకు ఆర్టీసి ని నిలబెట్టుకోలేమా అని ఆయన అన్నారు. మీ చేతుల్లో లక్ష్మి ఉంటుందని, మీరు తలచుకుంటే సంస్థ కచ్చితంగా నిలబడుతుందని కెసిఆర్ అన్నారు. నాలుగు నెలలు తర్వాత మళ్లీ కలుద్దామని, ఈ కాలంలో పట్టుబట్టి సంస్థను బాగు చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ సూచించారు.