వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలో మరో కీలకమైన మార్పు

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలో మరో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు జగన్. “వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా” పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయడమే కాకుండా చికిత్స తర్వాత కోలుకునే సమయంలో కూడా ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు రూ.225 లేదంటే నెలకు రూ.5వేల చొప్పున డబ్బును సాయంగా అందించనున్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 48 గంటల్లోపు రోగి బ్యాంకుకు నగదును జమ చేయనున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేపట్టిన పథకం అమలు కాకుంటే 104కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు స్పష్టం చేస్తోంది.

ఆరోగ్య శ్రీ సేవలు ఏపీలోని ఆసుపత్రుల్లోనే కాదు.. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు మహానగరాల్లోని 150కు పైగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అర్హులైన వారికి ఆరోగ్య శ్రీ సేవల్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.