73 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్… టెస్టుల్లో అత్యంత వేగంగా 7,000 రన్స్ చేసి… 73 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పాత రికార్డును శనివారం బద్ధలుకొట్టాడు. ఇందుకు ఆస్ట్రేలియా… అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికైంది. ప్రస్తుతం అక్కడ పాకిస్థాన్‌తో పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు జరుగుతోంది. తన 126వ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్.. ఈ 7,000 పరుగులు చేశాడు. ఈ ఫీట్ ద్వారా… ఇంగ్లండ్‌కి చెందిన వాలీ హమ్మండ్ పేరుతో ఉన్న రికార్డును స్టీవ్ బ్రేక్ చేశాడు. హమ్మండ్… తన 131 ఇన్నింగ్స్‌లో 7,000 రన్స్ చేశాడు. ఎప్పుడో 73 ఏళ్ల కిందట సాధించిన ఈ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చెయ్యలేకపోయారు. ఐతే… 30 ఏళ్ల స్మిత్… రికార్డ్ బ్రేక్ చేసేందుకు 23 రన్స్ కావాల్సి ఉండగా… ఆట మొదలుపెట్టాడు. ఈ ఫీట్ ద్వారా మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా రన్ స్కోరింగ్ లిస్టులో… డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను వెనక్కు నెట్టాడు. బ్రాడ్‌మన్… టెస్టుల్లో 6,996 రన్స్ చేశాడు.