2020 మే 3న నీట్‌ పరీక్ష : రేపటినుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2020 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే వెల్లడించనుంది. డిసెంబరు 2న నీట్(యూజీ)-2020 ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశముంది.ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబరు 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. నీట్ పరీక్ష హాల్‌టికెట్లను వచ్చే ఏడాది మార్చి 27 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన నెలరోజుల్లో అంటే.. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు.